జల వివాదం.. తెలంగాణ తగ్గిందా ?
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కృష్ణా బేసిన్‌లోని సాగర్, పులిచింతల వద్ద తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఆ రేంజ్ లో ఏపీ నుంచి రియాక్షన్ కరువైంది. దీనికి కారణం.. తెలంగాణలో మనవాళ్లు ఉన్నారని సీఎం జగన్ చెప్పడమే. అయితే జల, విద్యుత్ వివాదాలపై కేంద్రానికి లేఖలు రాశారు ఏపీ సీఎం జగన్. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కేంద్ర మంత్రులని కలిసి.. తెలంగాణపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు.. అవిఫలించినట్టున్నాయి.
పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తిని నిలిపేసింది. అర్ధరాత్రి నుంచి ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదు. పులిచింతల జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ 39.64 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. నీటి నిల్వ స్థాయి తగ్గిందనా.. ? లేక కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగి.. తెలంగాణ తగ్గిందా ? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.