ఆ స్టార్ హీరో రాక్షసుడు

ఆ స్టార్ హీరో రాక్షసుడు అని ప్రేక్షకులు చెప్పుకోబోతున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌-అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బెల్లకొండకు తొలి హిట్ ఇచ్చింది. ఇప్పుడీ.. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సీక్వెల్ తీసుకొస్తున్నట్టు దర్శకుడు రమేష్ వర్మ ప్రకటించారు. ‘రాక్షసుడు 2’ టైటిల్‌తో కూడిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

” ‘రాక్షసుడు 2’ వస్తుంది. ఈసారి మరింత థ్రిల్‌ కలుగుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది” అని తెలిపారు రమేశ్‌ వర్మ. అయితే సీక్వెల్ లో స్టార్ హీరో నటించబోతున్నారని సమాచారమ్. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘ఖిలాడీ’ తెరకెక్కింది. మరీ.. రాక్షసుడు 2 కోసం రవితేజని రిపీట్ చేస్తాడా ? లేక మరోసారి హీరోని తీసుకొచ్చి సప్రైజ్ చేస్తారా ?? అన్నది చూడాలి. ఇక రాక్షసుడు టెక్నికల్ టీమ్ సీక్వెల్ కి రిపీట్ కానుంది. హీరో-హీరోయిన్ పెయిర్ మారనుంది.