స్టార్స్ సెట్స్ పైకి వచ్చేశారు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో హీరోలంతా గంపగుత్తుగా ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లడం విశేషం. ఇప్పటికే రాధేశ్యామ్, ఆచార్య, ఆదిపురుష్ లాంటి సినిమాలు సెట్స్ పైకి వచ్చేశాయి. సోమవారం సర్కారువారి పాట, అఖండ, అఖిల్, రామ్ కొత్త సినిమాలు కూడా షురూ అయ్యాయి.

ఇక పవన్ కల్యాణ్-రానా మూవీ కూడా సోమవారం నుంచే సెట్స్ పైకి రావాలి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు కూడా. కానీ ఆఖరి నిమిషంలో సినిమాటోగ్రాఫర్ తో సమస్యలు రావడంతో షెడ్యూల్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
సినిమాలు తిరిగి సెట్స్ మీదకు వెళుతుండటంతో టాలీవుడ్ లో సందడి మొదలైంది. పండగ వాతావరణం కనిపిస్తోంది. #shootresumes పోస్టర్స్, పిక్స్ క్యూ కడుతున్నాయి. అవి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

మరోవైపు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్ ని ప్రకటించుకోనున్నాయి. ఈ నెలాఖరు నుంచి థియేటర్స్ కి సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఈ నెల ఆఖరి వారంలో లవ్ స్టోరీ, వచ్చే నెల మొదటి వారంలో నాని టక్ జగదీష్ రిలీజ్ కానున్నాయని సమాచారమ్. ఈలోపు ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరపనున్నారు. టికెట్ రేట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు సమాచారమ్.
