యష్ తో బోయపాటి సినిమా ?

‘కేజీఎఫ్‌’తో పాన్ ఇండియా స్టార్‌ మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇక కేజీఎఫ్ 2 తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యష్ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు యష్ కోసం టాలీవుడ్ ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ట్రై చేస్తున్నాడట. బోయ‌పాటి ద‌గ్గ‌ర ఓ మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్, యాక్ష‌న్ క‌థ ఉంది. 

ఆ క‌థ‌కి య‌ష్ సెట్ అవుతాడ‌ని బోయ‌పాటి శ్రీ‌ను భావిస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు సూర్య‌తో బోయ‌పాటి శ్రీ‌ను ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది మ‌రో క‌థ‌. మొత్తానికి అఖండ‌ అవ్వ‌గానే బోయ‌పాటి సూర్య, యష్ లని కలిసి కథలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. మరీ.. ఈ ఇద్దరిలో ఎవరు బోయపాటికి ఓకే చెబుతారు ? అన్నది చూడాలి.