దాదా బయోపిక్.. అద‌న‌పు మసాలాలు ఉంటాయా ?

క్రికెట్ దిగ్గజాల జీవితకథలు సినిమాలుగా వచ్చాయ్. కానీ అన్నీ ప్రేక్షకులని మెప్పించలేకపోయాయ్. క్రెకెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎన్నో ఎమోష‌న్స్ ఉన్న అజ‌ర్ బ‌యోపిక్ కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాదా బయోపిక్ రాబోతుంది.

టీమిండియా మాజీ కెప్టెన్, ప్ర‌స్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌భ్ గంగూలీ త‌న బయోపిక్ ను అనౌన్స్ చేశాడు. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిగిన విష‌యాన్ని గంగూలీనే ధ్రువీక‌రించాడు. మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే చెబుతాడ‌ట దాదా. దాదాది దూకుడైన ఆట తీరు. గొప్ప ఇన్నింగ్స్ లున్నాయి, కెప్టెన్ గా ప్ర‌త్యేక ముద్ర వేశాడు. ఫిక్సింగ్ గోల మ‌ధ్య‌న గంగూలీ కెప్టెన్సీ తీసుకోవ‌డ‌మే చెప్పుకోద‌గిన ఘ‌ట్టం. న‌గ్మాతో ఎఫైర్ వంటివి కూడా అద‌న‌పు మసాలాలు కానున్నాయ్. అయితే వాటిని దాదా బయోపిక్ లో చూపిస్తారా.. ? స్కిప్ చేస్తారా ?? అన్నది చూడాలి.