గోపీచంద్-శ్రీ‌వాస్ హ్యాట్రిక్

గోపీచంద్-శ్రీ‌వాస్ ల హ్యాట్రిక్ సినిమా ప్రకటన వచ్చేసింది. గోపీచంద్ న‌టించే 30వ సినిమాకి శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే.. సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. గోపీచంద్-శ్రీ‌వాస్ లది హిట్ కాంబోనే. వీరి కలయికలో వచ్చిన ల‌క్ష్యం, లౌక్యం హిట్ అయ్యాయ్. దీంతో వీరి హ్యాట్రిక్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ప్ర‌స్తుతం గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో న‌టిస్తున్నారు. అది పూర్త‌యిన వెంట‌నే ఈసినిమా ఉంటుంది. అయితే ఇది బాలయ్య కోసం రెడీ చేసుకున్న కథ అని తెలిసింది. బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకున్న శ్రీవాస్.. ఆయనకి వినిపించారు. బాలయ్య కూడా ఒకే చెప్పారు. కానీ అక్కడ భారీ క్యూ ఉంది. బాలయ్య దాదాపు అరడజను సినిమాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదే కథతో గోపీచంద్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది.