ఆప్ గూటికి సిద్ధూ ?
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌కు, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూకు మధ్య ఏర్పడిన విభేదాలను చక్కదిద్దేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. కానీ ఫలితం కనిపించడం లేదు. నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఆప్ గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆయన చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూర్చుతోంది. “నా దూరదృష్టిని, పనితీరును ఆమ్‌ఆద్మీ పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. మాదకద్రవ్యాలు, రైతు సమస్యలు, అవినీతి, విద్యుత్ ఇలా ప్రతి అంశంలోనూ పంజాబ్ రాష్ట్ర ప్రజల పక్షాన తాను ఎలా పోరాడుతున్నానో ఆప్ నిశితంగా గమనిస్తోంది. రాష్ట్రం కోసం నిస్వార్థంగా ఎవరు పని చేస్తున్నారో వారికి తెలుసు” అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఆప్ వైపు చూస్తున్నారని స్పష్టం అవుతోంది.
ఈ యేడాది చివరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చిన బీజేపీ పై పంజాబ్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు క్రేజీవాల్ పంజాబ్ పై ఫోకస్ పెట్టారు. పంజాబ్ పీఠం దక్కించుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Our opposition AAP has always recognised my vision & work for Punjab. Be it Before 2017- Beadbi, Drugs, Farmers Issues, Corruption & Power Crisis faced by People of Punjab raised by me or today as I present “Punjab Model” It is clear they know – who is really fighting for Punjab. <a href=”https://t.co/6AmEYhSP67″>https://t.co/6AmEYhSP67</a> <a href=”https://t.co/7udIIGkq1l”>pic.twitter.com/7udIIGkq1l</a></p>— Navjot Singh Sidhu (@sherryontopp) <a href=”https://twitter.com/sherryontopp/status/1414858384411545604?ref_src=twsrc%5Etfw”>July 13, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>