గీతా ఆర్ట్స్ వద్ద మహిళా ఆత్మహత్యా యత్నం.. అరెస్ట్ !

సునీత బోయ – ఈ పేరు చాలా సార్లు వినే ఉంటారు. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. పలు మార్లు గీతా ఆర్ట్స్ ముందు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఆమెని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె మానసిక పరిస్థితి బాగులేదని రెండుసార్లు ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స కూడా అందించారు.
తాజాగా వారం కిందట ఆమె మరో వీడియో పోస్టు చేశారు. బన్నీ వాసు బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆ వీడియోలో ఆమె పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక చికిత్సాలయానికి తరలించాలని జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.