బ్రేకింగ్ : రూ. కోట్లు తెచ్చిపెట్టిన కోకాపేట భూములు

కోకాపేట భూములు రూ. కోట్లు కుమ్మరించాయి. కోకాపేటలోని 49.92 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్ గా చేసింది పురపాలక శాఖ. ఈ వెంచర్‌కు నియోపొలిస్ పేరు పెట్టింది. ఈ-వేలం నిర్వహించింది. ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్ ద్వారా హెచ్‌ఎండీఏ ఇవాళ వేలం నిర్వహించగా భారీ ధర పలికినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి.. కోకాపేట భూములు ప్రభుత్వానికి వందల రూ. కోట్ల ఆదాయాన్ని తీసుకురానున్నాయి.