రివ్యూ : మాలిక్ – మాస్టర్ పీస్

చిత్రం : మాలిక్‌ (2021)

నటీనటులు : ఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌, జోజీ జార్జ్‌, దిలీష్‌

పోథన్‌, తదితరులు

సంగీతం : సుషిన్‌ శ్యామ్‌

దర్శకత్వం: మహేశ్‌ నారాయణన్

నిర్మాత : ఆంటో జోసెఫ్‌ 

విడుదల : ఓటీటీ – అమెజాన్ ప్రైమ్ 

విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తాజా చిత్రం మాలిక్. భూ కబ్జా, రాజకీయ అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రానికి మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తాజాగా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా విడుదలయ్యింది. మరి.. మాలిక్ కథ ఏంటీ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ

కేరళలోని రందాన్‌పల్లి అనే సముద్రతీర ప్రాంతానికి అలీ అహ్మద్‌ సులేమాన్‌ మాలిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) గ్యాంగ్‌స్టర్‌. ఆ ప్రాంతంలో ఆయన మాటే శాసనం. ఆఖరికి పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఆయన మాట వినాల్సిందే. అలాంటి సులేమాన్‌ పై ఏళ్ల క్రితం జరిగిన ఓ మత ఘర్షణ కేసును రీ ఓపెన్‌ చేసి.. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్న సులేమాన్‌ని జైలుకి పంపిస్తారు ప్రత్యర్థులు. జైల్లోనే చంపేయాలనే ప్లాన్ చేస్తారు. ఇంతకీ వారి ప్లాన్‌ ఏమైంది? రందాన్‌పల్లికి ఆయన ఎలా మాలిక్‌ అయ్యాడు? అన్నది మిగితా కథ. 

హైలైట్స్ :

* సినిమాని చాలా ఆసక్తిగా ప్రారంభించాడు దర్శకుడు. తొలి 13 నిమిషాలు ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంటుంది. ఆరంభ సన్నివేశాలతోనే అసలు మాలిక్‌ ఎవరన్న సంగతి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించేలా చేశాడు దర్శకుడు.

 * సులేమాన్‌ డాన్ గా ఎలా మారాడు ? అన్న సన్నివేశాలు ఫస్టాఫ్ లో చూపించారు. కథ-కథనాలని వాస్తవానికి దగ్గర చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ సినిమాగా స్లోగా సాగుతుంంది.

* ఇక సెకాంఢాఫ్ లో సులేమాన్‌ పూర్తిస్థాయి నాయకుడిగా ఎలా ఎదిగాడన్న విషయాన్ని చూపించాడు దర్శకుడు. సన్నివేశాలు ఎమోషనల్ సాగుతాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. కథ-కథనాలు బాగున్నా.. సినిమా నెమ్మదిగా సాగడం ఇబ్బందిగా అనిపిస్తుంది.

* సినిమా మొత్తంలో  ఫహద్‌ ఫాజిల్‌ అస్సలు కనిపించడు. అంతలా పాత్రలో లీనమై పోయి నటించాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వయసుమళ్లిన వ్యక్తిగా మూడు వేరియేషన్స్‌లో తనదైన ప్రతిభ కనబరిచాడు.

* నిమిషా సజయన్‌ (సులేమాన్‌ భార్య) పాత్ర పరిధి ఉన్నంత వరకూ అద్భుతంగా నటించింది. మిగితా నటీనటీలు తమ తమ పరిధి మేరకు నటించారు.

* సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు. అతడే సినిమాటోగ్రాఫర్‌ సాను జాన్‌. ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తీర్చిదిద్దారు. తన పనితనంతో సినిమా స్థాయిని పెంచాడు.

* సినిమాలో సింగిల్ టేక్ 12 నిమిషాల సీన్  హైలైట్. ఈ సీన్ లో నటీనటుల, సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ కనిపిస్తుంది. 

* నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. కాస్ట్యూమ్‌ డిజైన్‌ బాగుంది.

* సినిమా రన్ టైమ్  2 గంటల 40 నిమిషాలు. ఓటీటీకి ఇది ఎక్కువే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా : మాలిక్ కథ-కథనాలు అద్భుతంగా కుదిరాయ్. దర్శకుడు మహేశ్‌ నారాయణన్ వాస్తవ సంఘటనలకు దగ్గరగా సినిమాని తీర్చేదిద్దే ప్రయత్నం చేశారు. ఫహద్‌ ఫాజిల్‌ అద్భుతమైన నటనతో అదరొట్టేశాడు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలాలు. అయితే సినిమా నేరేషన్ మొదటి నుంచి స్లోగా సాగడం ఒక్కటే కాస్త మైనస్ పాయింట్. మిగితావన్నీ హిట్టే. 

రేటింగ్ : 3/5

నోట్ : ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిపాయం మాత్రమే.