హాట్ సీటులో రామ్ చరణ్.. ఎప్పుడు వాడతారు ?

తారక్-రామ్ చరణ్ మంచి స్నేహితులు. ‘ఆర్ఆర్ఆర్’ వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఇప్పుడు మరోసారి ఆ స్నేహబంధం తెరపై కనిపించబోతోంది. అయితే పెద్ద తెరపై కాదు. బుల్లి తెరపై. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎపిసోడ్ ల షూట్ ప్రారంభం అయింది.

హాట్ సీటులో కామన్ మాన్ లని కూర్చోబెట్టే.. వారికి రూ. కోట్లు గెలుచుకొనే అవకాశం ఇచ్ఛే కార్యక్రమం ఇది. అయితే మధ్య మధ్యలో సెలబ్రెటీలని హాట్ సీట్ లో కూర్చోబెడతారు. షోక్ కి బజ్ తెచ్చే ప్లాన్ లో భాగంగా చేసేది ఇది. ఈ క్రమంలో రామ్ చరణ్ హాట్ సీట్ లోకి రాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈ రోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ టైమ్ లో ఈ ఏపీసోడ్ ని ప్రసారం చేయొచ్చేమో.. !