తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వాడుకోవడం లేదు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. అది ఇప్పుడు సుప్రీం కోర్టు గడప కూడా తొక్కింది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు.
నీటి పంచాయితీకి ఏపీ ప్రభుత్వం వైఖరే కారణమన్నారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదు. నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుతుతాం అన్నారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.