థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం.. WHO హెచ్చరిక !
కరోనా థర్డ్ వేవ్ ఉదృతిపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్ 111 దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు.
వ్యాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన, సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు టెడ్రోస్ అధనోమ్ పిలుపు నిచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో ఉంచడంతో పాటు సామూహిక సమావేశాలపై కట్టడిపై సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరంఉందన్నారు.ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అన్నారు.