తారక్ హీరోయిన్ ఎవరు ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది.

‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకి పిచ్చి పిచ్చగా నచ్చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఇక బాలీవుడ్ అర్జున్ రెడ్డి ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. కైరా అక్కడే ఫుల్ బిజీ అయింది. తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి. 

అలాంటి బిజీలోనూ ఆమె తారక్ సినిమాకు ఓకే చెప్పేసింది. కొరటాల-తారక్ కాంబోలో రాబోతున్న సినిమాలో కైరా హీరోయిన్ అనే వార్తలు వినిపించింది. ఇప్పుడు కొత్తగా కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. తారక్ పక్కన మరోసారి పూజా కనిపించనుందే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారక్ హీరోయిన్ ఎవరు ? అఫిషియల్ అప్ డేట్ ఎప్పుడు ? అనే చర్చ నందమూరి అభిమానుల్లో జరుగుతోంది.