రివ్యూ : నారప్ప
చిత్రం : నారప్ప (2021)
నటీనటులు : వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : కలైపులి ఎస్.థాను, డి.సురేశ్‌బాబు
విడుదల : ఓటీటీ – అమెజాన్ ప్రైమ్ వీడియో (20 జులై, 2021)
తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ‘నారప్ప’. వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు విడుదలైంది. మరీ.. ‘నారప్ప’ ఎలా ఉన్నాడు ? ‘అసురన్’కు దీటుగా ‘నారప్ప’ ఉన్నాడా? ఆ మేజిక్ మరోసారి రిపీట్ అయిందా ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
నారప్ప (వెంకటేశ్) అనంతపురం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు. తన భార్య సుందరమ్మ (ప్రియమణి)తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్).. తన తమ్ముడి దొరస్వామి(దీపక్ శెట్టి) కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు.
ఈ విషయంలోనే పండు స్వామి, అతని మనుషులతో మునికన్నా గొడవపడి, పండుస్వామిని అవమానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేస్తారు. అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అన్నది మిగతా కథ.
హైలైట్స్ :
* యాక్షన్ డ్రామాగా తమిళంలో వచ్చిన ‘అసురన్’ ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’గా తీయడంలో విజయం సాధించారు. మాతృకలోని ఉన్న ఎమోషన్స్‌ను తెలుగులోనూ కొనసాగిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.
* మాతృక ‘అసురన్’ను యథావిధిగా ఫాలో అయ్యాడు
* యువకుడిగా, ముగ్గురు పిల్లలకు తండ్రిగా వెంకటేశ్ స్క్రీన్‌పై కనిపించిన తీరు మెప్పిస్తుంది. వెంకీ వన్ మేన్ షో చేశారు.వెంకీ తర్వాత చెప్పుకోదగ్గ పేరు మణిశర్మ.
* యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.
* ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్
నేపథ్య సంగీతం
ఇంటర్వెల్, క్లైమాక్స్ ఏపీసోడ్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ స్లో నేరేషన్
ప్రారంభ సన్నివేశాలు
చివరగా : ‘అసురన్’ని ఉన్నది ఉన్నట్టుగా దింపే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. అసరున్ చూడని వారికి అద్భుతం అనిపిస్తుంది. మిగితా వారికి సేమ్ టు సేమ్ అనిపిస్తోంది. మొత్తానికి.. ‘నారప్ప’ ఓకే అనిపించాడు.
రేటింగ్ : 3/5