పృధ్వీ షా మెరుపులు.. అవుట్ !
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే లో టీమిండియా 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ పృధ్వీ షా తొలి వన్ డే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ.. దూకుడుగా మొదలెట్టాడు. తొలి ఓవర్ మొదటి మూడు బంతులని బీట్ చేసిన షా.. ఆ తర్వాత మూడు బంతులని వరుసగా ఫోర్లుగా మలిచాడు. దూకుడుగా కనిపించిన షా 13 పరుగుల వద్ద వనిందు హనిరంగా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన కిషాన్ కిషన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవుట్ అయ్యాడు.
5 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 22, మనీష్ పాండే 0 పరుగులతో ఉన్నారు. తొలి వన్డే లో సత్తా చాటిన పృధ్వీ షా, ఇషాన్ కిషన్ రెండో వన్ డే లో మాత్రం నిరాశపరిచినట్టయింది. అయితే టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించగలరు. ఈ నేపథ్యంలో టీమిండియాకు విజయవకాశాలు ఎక్కువని చెప్పవచ్చు.