రస్మిక రిచ్ మెయింటెనెన్స్

రష్మిక మందన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కోలీవుడ్ లోనూ ఆమె హవా మొదలైంది. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే రెండు, మూడు సినిమాలని తన ఖాతాలో వేసుకుంది. అక్కడ కూడా రస్మిక తన టాలెంట్ చూపించనుంది. ఈ క్రమంలో రస్మిక భారీగానే సంపాదిస్తోంది. మంచి లైఫ్ లీడ్ చేస్తోంది.

కోట్ల సంపాదనను ఓవైపు పెట్టుబడులుగా పెడుతూనే, మరోవైపు తన ఖర్చులు, లగ్జరీల కోసం వెచ్చిస్తోంది. రష్మిక దగ్గర లగ్జరీ కార్లు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 ఉన్నాయి. ఆడి క్యూ3, మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్ తో పాటు, టాలీవుడ్ ఫేవరెట్ బండి రేంజ్ రోవర్ ఎస్ యూ వీ కూడా ఉంది. ఇవి కాకుండా ఇన్నోవా, హుందాయ్ క్రెటా కార్లు కూడా రష్మిక దగ్గరున్నాయి.

ఇక లగ్జరీ కార్లతో పాటు.. లగ్జరీ యాక్ససిరీస్ వాడుతుంది రస్మిక. మినిమం లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ బ్యాగ్స్ రష్మిక దగ్గరున్నాయి. ఇటీవలే ముంబైలో ఓ ఇల్లు కొనేసింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులోనూ రస్మికకు సొంతం ఇళ్లు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా రస్మికకు స్థిర ఆస్తులు ఉన్నాయట. మొత్తానికి.. రస్మిక రిచ్ లైఫ్ మెయిటైన్ చేస్తోంది.