‘మా’ అధ్యక్షుడిగా బాలయ్య.. ఏకగ్రీవం !

మూడ్నేళ్ల ముందు నుంచే మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్) ఎన్నికల హీట్ మొదలైంది. సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నెల రోజుల క్రిందటే మా అధ్యక్ష పోటీలో ఉన్నట్టు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, ఏవిఎల్ నరసింహారావు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా తన ప్యానల్ ని ప్రకటించేశారు. వారితో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. దీంతో ఆట ముగిసిపోలేదు. ఇప్పటికీ మా ఎన్నికల్లో ఏకగ్రీవానికి ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి.

వాటికి తగ్గట్టుగానే మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మా బిల్డింగ్ బాధ్యత నాది. అయితే మా అధ్యక్ష పదవి ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. అలా కానీ యెడల పోటీలో ఉంటానని ప్రకటించారు. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన మంచు మనోజ్.. మరో సంచలన ప్రకటన చేశారు. సీనియర్ హీరో బాలకృష్ణని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేస్తే.. నాకు ఆనందం. తాను పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

మంచు మనోజ్ ప్రకటనతో మా అధ్యక్ష పోటీలోకి బాలయ్య వచ్చినట్టయింది. ఇటీవల మా అధ్యక్ష ఎన్నికలపై ఒకట్రెండు సార్లు బాలయ్య స్పందించారు. అసలు ఇప్పటి వరకు మా బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహించిన కార్యక్రమాలు.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మా పోటీలో లోకల్-నాన్ లోకల్ లాంటి అభ్యంతరాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. మరీ.. మంచు మనోజ్ కోరినట్టు బాలయ్యని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేస్తారేమో చూడాలి.