పోర్న్ వీడియో కేసు : ఇన్నాళ్లు లంచం ఇచ్చి తప్పించుకున్న రాజ్ కుంద్రా
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ బిజినె మేన్ రాజ్ కుంద్రా పోర్న్ వీడియో కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 4న పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసు నమోదు చేసినా.. రాజ్ కుంద్రాని మాత్రం అరెస్ట్ చేయలేదు. దీనికి గల కారణం.. పోలీసులకు రాజ్ కుంద్రా రూ. 25 లక్షల లంచం ఇవ్వడమేనట. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ గత మార్చిలో ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు పంపించిన ఈమెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించారని ప్రముఖ వార్త పత్రిక పేర్కొంది. రాజ్ కుంద్రా లంచం ఇచ్చారనే వార్తలపై పోలీసులు ఎవరూ నోరు విప్పడం లేదని తెలుస్తోంది.
హాట్ షాట్స్ పేరిట OTT యాప్ ద్వారా పోర్న్ చిత్రాలను క్రియేట్ చేయడం రాజ్ కుంద్రా బిజినెస్ అని పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ఆయన కోట్లు గడించారని గుర్తించారు. ఈ యేడాది ఫిబ్రవరిలో ముంబై శివారులో ఉన్న మాద్ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం రావడంతో… పోలీసులు దాడులు జరిపారు. ఈ కేసులో 11 మందిన అరెస్టు చేసి జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలోనే రాజ్ కుంద్రాని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆయన పోలీసులకు రూ. 25 లక్షల లంచం ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.