హీరోయిన్ సాయేషాకు పాప పుట్టిందోచ్ !
హీరోయిన్ సాయేషా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టింది. ఈ విషయాన్ని హీరో విశాల్ స్వయంగా ప్రకటించాడు. తన సోదరుడు ఆర్య తండ్రి అయ్యాడని, సాయేషా పండంటి పాపకు జన్మనిచ్చిందని విశాల్ తెలిపారు.
‘గజనీకాంత్’ సినిమా కోసం ఆర్య-సాయేషా తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019 మార్చిలో వీళ్లిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. సాయేషా గర్భవతి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు పాప పుట్టిందని చెబుతూ.. అందరి సప్రైజ్ కి గురి చేసింది.
ఇక ఆర్య నటించిన ‘సార్పట్ట’ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆర్య, విశాల్ కలిసి ‘ఎనిమి’ అనే సినిమా చేస్తున్నారు.