హ్యాపీ బర్త్డే అన్నయ్యా !
TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, సన్నిహితులు, స్నేహితులు, ప్రజల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఎమ్మెల్సీ కవిత కూడా అన్నయ్యకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ సందర్భంగా ఓ రేర్ పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్డే అన్నయ్యా.. ‘ అంటూ విష్ చేసింది. సుఖసంతోషాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించింది.
ఇక కేటీఆర్ బర్త్ డే సందర్భంగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొక్కుల నాటారు. గులాభి శ్రేణులు కేటీఆర్ బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హోరెత్తిస్తున్నారు. దీంతో.. సోషల్ మీడియా ఈరోజు గులాబిమయం అయింది.