ఆ కోరిక తీర్చుకున్న పూజా

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పట్టిందల్లా బంగారమే. ఆమె ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది. ఒకటికి రెండు రౌండ్లు వేస్తోంది. అయినా.. పూజా కోరిక తీరలేదట. ఓ కోరిక ఇన్నాళ్లు తీరకుండానే ఉందట. అదే ఫుల్ లెన్త్ ప్రేమకథా సినిమాలో నటించాలి. ఇప్పుడీ.. ఈ కోరిక రాధేశ్యామ్ తో తీరిందని హ్యాపీగా చెబుతోంది బుట్టబొమ్మ.

“ఇదొక మెచ్యూర్ లవ్ స్టోరీ. చాలా యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న రొమాంటిక్ మూవీ ఇది. ఇక నా విషయానికొస్తే.. నేను చాన్నాళ్లుగా ఓ ప్రాపర్ లవ్ స్టోరీ చేయలేదు. ఈమధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ ప్రేమకథ ఇదే. అందుకే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది” అని పూజా చెప్పుకొచ్చింది.

‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్’ని ప్రకటించనున్నారు. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారా ? లేక ఒకే టైమ్ లో ఇటు ఓటీటీ అటు థియేటర్స్ లోనూ రిలీజ్ చేస్తారా ?? అన్నది తెలియాల్సి ఉంది.