మరదల్ని ఆ రొంపులోకి దించాలని ప్లాన్ చేసిన రాజ్ కుంద్రా !

పోర్న్ ఫిల్స్ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు బయటి కొస్తున్నాయి. పోర్న్ చిత్రాలని చిత్రీకరించి.. వాటిని యాప్ లో పెట్టి కోట్లు గడించాడన్నది రాజ్ కుంద్రాపై ఆరోపణలు. అది నిజమేనని రాజ్ కుంద్రా తరుపున న్యాయ వాదులు ఒప్పుకున్నారు. అయితే అవి పోర్న్ చిత్రాలు కాదని వారు కోర్టులో వాదించారు. అవి పోర్న్ ఫిల్మ్ లు కాదని.. కేవలం ఎరోటికా కేటగిరి సినిమాలు మాత్రమేనని వారు అంటున్నారు. వాటిలో పోర్న్ సినిమాల్లో చూపిన తరహాలో చిత్రీకరణ లేదన్నది వారి వాదన.

మరో షాకింగ్ విషయం ఏటంటే ? తన మరదలు షమితా షెట్టిని పెట్టి ఒక సినిమాను రూపొందించాలని కూడా రాజ్ కుంద్రా అనుకున్నారట. అది కూడా ఎరోటికా కేటగిరి సినిమానే అని తెలుస్తోంది. త్వరలోనే బాలీఫేమ్ పేరిట ఒక యాప్ ను మొదలుపెట్టి.. అందులో సినిమాలు, బాలీవుడ్ స్టఫ్, చాట్ షోలు పెట్టాలనేది కుంద్రా ప్రణాళిక అట. ఇంతలో ఆయన అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. లేదంటే.. మరదలు అందాలని తెరపై చూపించేవారని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
