పోర్న్ ఫిల్మ్స్ కేసు.. షాకింగ్ నిజాలు !
పోర్న్ ఫిల్మ్స్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు.. బాలీఫేమ్ తో ఐబీకి చెందిన ఓ అధికారిని కూడా భాగస్వామ్యం చేసినట్టు తెలిసింది. అవార్డులు గెలుచుకున్న లఘు చిత్రాలను ప్రసారం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించాడు. దీంతో ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్‌ను రిజిస్టర్ చేశాడు. అయితే ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.