‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషనల్ సాంగ్ పాడింది.. వీరే !

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రమోషనల్ సాంగ్ ని షూట్ చేశారు. స్నేహం విలువని చాటిచెప్పే గీతమిది.

తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించిన ఈ పాట ఆగస్టు 1న విడుదల కానుంది.

The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊

An @mmkeeravaani Musical.🎵

🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt— RRR Movie (@RRRMovie) July 27, 2021