కేజీఎఫ్‌-2 : ‘అధీరా’ కొత్త లుక్ అదిరింది

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్‌ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-1’ విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ -2′ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కేజీఎఫ్‌-2’ నుంచి ఓ సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది.

ఈరోజు సంజయ్‌ దత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అధీరా’ సరికొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సంజయ్‌దత్‌.. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. మరోవైపు ‘అధీరా’ పోస్టర్‌ షేర్‌ చేసిన సంజయ్‌.. ‘మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ‘కేజీఎఫ్‌-2’లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.