తెలంగాణలో కొత్త ఉద్యమం
తెలంగాణలో కొత్త ఉద్యమం రాబోతుందని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆ నియోజకవర్గ ప్రజలపై కురుస్తున్న వరాల జల్లుని చూసి.. మిగితా నియోజకవర్గ ప్రజల్లో ఆశ మొదలైంది. తమ నియోజవర్గంలోనూ ఉప ఎన్నిక వస్తే.. బాగుండు అని చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో ఉప ఎన్నిక వస్తే తప్ప.. అభివృద్ది జరగదని జనాలకు అర్థమైంది.
ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, నాగార్జున సాగర్ నియోజవర్గాలు కాస్త తెల్లగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా ఈ నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఆయన చెప్పిన రేంజ్ లో కాకపోయినా.. కొత్త మేరకు అభివృద్ది జరిగింది. ఇప్పుడు.. హుజూరాబాద్ ని అంతకుమించి అభివృద్ది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగితా నియోజకవర్గ ప్రజలు.. తమ నియోజవర్గంలో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారు. దీనిపై ఉద్యమాలు చేయాలని కొందరు పిలుపునిస్తుండటం విశేషం.