తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్టే పట్టీ.. మళ్లీ విజృంభిస్తోంది. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ కి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ప్రతిరోజూ గాంధీకి 10 నుంచి 20 కేసులు మాత్రమే వస్తుండేవి. అవి కూడా మరీ తీవ్రమైన కేసులు కావట. అయితే ఇప్పుడు.. ప్రతిరోజూ 50 వరకు తీవ్ర కేసులు గాంధీకి వస్తున్నాయని చెబుతున్నారు.

ఆగస్టు 3 నుంచి గాంధీ హాస్పటల్ లో ఓపీ సేవలని తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన మొదలైంది. ఓపీ సేవలు తిరిగి ప్రారంభించడం సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కరోజులోనే 45శాతం కేసులు పెరగడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇది థర్డ్ వేవ్ కు దారి తీయనుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.