కుర్రాళ్లు పోరాడారు.. కానీ !
రెండో టీ20లో శ్రీలంక గెలిచింది. సిరీస్ ని 1-1తో సమం చేసింది. టీమ్ఇండియా నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్నిశ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. లంక విజయానికి ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా.. మరో 2 బంతులు మ్గిగిలి ఉండగానే డిసిల్వ లంకను విజయతీరాలకు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్(40), కొత్త ఆటగాడు పడిక్కల్(29) మినహా మిగతా వారువిఫలమయ్యారు. దీంతో భారత్ శ్రీలంక ఎదుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక జట్టులో ధనంజయ 2 వికెట్లు తీశాడు. కృనాల్ పాండేకు కరోనా సోకడంతో.. సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్థిక్ పాండే, పృధ్వీ షా.. తదితరులు క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం ఐదుగురు బ్యాట్స్ మెన్స్ తో టీమిండియా రంగంలోకి దిగింది.