కేరళ కంప్లీట్ లాక్‌డౌన్

కేరళలో మళ్లీ భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడ మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 20వేలకు పైగా బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసులు సగం కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులు దేశంలో థర్డ్ వేవ్ కు దారి తీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అలర్ట్ అయింది. కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది.