‘మహాసముద్రం’ మోషన్ పోస్టర్ చూశారా.. ?

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్దార్థ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఇంటెన్స్‌ ప్రేమకథా చిత్రం ‘మహాసముద్రం’. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. జగపతిబాబు, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ లని చూపించారు.  సిద్దార్థ్‌, శర్వానంద్‌ల లుక్‌లు తెలియజేసే విధంగా సిద్ధమైన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది. ఆర్ఎక్స్100 తర్వాత అజయ్ భూపతి ఏరికోరి ఎంచుకున్న కథ. ఈ కథ చాలామంది హీరోల దగ్గరకి వెళ్లింది. ఫైనల్ గా శర్వానంద్, సిద్ధార్థ్ తో ఈ ప్రేమకథా చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

Here are the Badass & Bindaas Characters from our #MahaSamudram 🌊

Be Ready to witness INTENSE 🔥 & STUNNING 👊 Characterisations 😎

A @chaitanmusic Musical 🎹@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/h0PoXavoTk— Sharwanand (@ImSharwanand) July 29, 2021