తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారు.. నటి ఫిర్యాదు !
పోర్న్ గ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ముంబయి చెందిన ఓ నటి.. హాట్‌షాట్స్ కోసం తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో గహనా వశిష్ఠ్ సహా 10 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఎన్నో విస్తుపోయే నిజాలు తెలిశాయి. అందులో భాగంగా నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను జులై 19న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పోర్న్ చిత్రాలని చిత్రీకరించి.. వాటిని యాప్ లో ఉంచి రాజ్ కుంద్రా కోట్ల రోపాయాలు గడించారనే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో శిల్పా శెట్టి పాత్ర ఉందా ? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.