APలో నైట్ కర్ఫ్యూ పొడగింపు

కరోనా ఆంక్షలని పొడగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూని ఆగస్టు 14 వరకు పొడగించింది. ఈ మేరకు అన్నీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీలో ఆగస్టు 14 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 2,107 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.