‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ చెప్పేశారు. గురువారమే ‘రాధేశ్యామ్‌’ షూట్‌ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది.

వాస్తవానికి ఈ యేడాది జులై 30న రాధేశ్యామ్ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఇటలీలో తీయాల్సిన కొన్ని సీన్స్ ని ఇక్కడే సెట్స్ వేసి తీసేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో.. ఈ యేడాదియే రాధేశ్యామ్ రిలీజ్ ఉంటుందని ప్రభాస్ అభిమానులు భావించారు. కానీ.. ప్రభాస్ సంక్రాంతి పుంజుగా మారాడు. సంక్రాంతి బరిలో నిలిచారు.

ఈ చిత్రానికి కె. రాథాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే లవర్‌బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పూజాహెగ్డే ప్రేరణగా సందడి చేయనున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు.