తన పేరులో ‘అక్కినేని’ని తీసేసిన సమంత.. నెటిజన్స్ అనుమానాలు !

స్టార్ హీరోయిన్ సమంత పేరు మార్చుకుంది. Samantharuthuprabhu అనే తన పూర్తి పేరుతో ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలు ప్రారంభించిన సామ్.. అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఏడడుగులు వేసిన అనంతరం Samantha Akkineniగా ఆయా ఫ్లాట్‌ఫామ్స్‌లో పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన పేరులో అక్కినేని తొలగించేసింది. కేవలం ‘S’ అని పెట్టింది.

దీనిపై నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్యతో సామ్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేవలం పేరు మార్చుకుంటేనే భూతద్దంలో పెట్టడం చూడటం ఏంటని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో రాజీగా ప్రేక్షకుల్ని అలరించిన సామ్ ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు.