డెల్టా వేరియంట్ పై WHO హెచ్చరిక
డేల్టా రకం కరోనా వేరియెంట్ ప్రమాదకరంగా మారుతోంది. తొలుత భారత్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు 132 దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) దేశాలకు కీలక సూచనలు చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టకముందే మహమ్మారిని అదుపు చేయాలని హెచ్చరించింది.
ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఒకవేళ వైరస్ ఇలాగే రూపాంతరం చెందుతూ వెళితే.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు ఉద్భవిస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం.. వంటి పనులను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు.