ఈ దోస్తీ అసలు సాధ్యమే కాదు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ పాట వచ్చేసింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘దోస్తీ’ పేరుతో ప్రత్యేకంగా ఓ పాటను విడుదల చేశారు. ఐదు భాషల్లో విడుదలైన పాట యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. తెలుగు పాటను హేమచంద్ర ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.

ఈ పాటలోనే సినిమా కథాంశం గురించి క్లుప్తంగా వివరించేశారు సిరివెన్నెల. ప్రతిసారి ఓ రెండు విరుద్ధ భావాలు/శైలి ఉన్న వాటి మధ్య దోస్తీ గురించి చెప్పారు రచయిత. “పులుకి.. విలుకాడికి.. దోస్తీ”, “తలకి.. ఉరితాడుకి.. దోస్తీ”, “కదిలే కార్చిచ్చుకి.. కసిరే వడగడ్లకి.. దోస్తీ”, రవీకి.. మేఘానికి.. దోస్తీ”, “బడబాగ్నికి.. జడివానకి.. దోస్తీ”, “విధిరతకి.. ఎదురీతకి.. దోస్తీ”, “పెను జ్వాలకీ.. హిమ నగరానికి దోస్తీ” వీటిలో ఏ రెండింటి మధ్య దోస్తీ అసలు సాధ్యమే కాదు. సినిమా చూస్తేనే.. ఈ స్నేహం ఎలా కుదిరింది ? అన్నది క్లారిటీ రానుంది.