టోక్యో ఒలంపిక్స్ : కాంస్యం సాధించిన సింధు

టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు స్వర్ణం మిస్సయిన కాంస్య పథకం దక్కింది. ఆదివారం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగి పోరులో సింధు వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన సెమీస్‌ పోరులో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో ఆసక్తికర పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించింది. దాంతో వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించింది.