మళ్లీ పెరుగుతున్న క్రియాశీల రేటు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 40వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,134 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. మృతుల సంఖ్య 4.24 లక్షలకు చేరింది.
ప్రస్తుతం 4,13,718 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ ప్రతిరోజూ.. 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు.