డెల్టా వేరియంట్.. ప్రపంచ దేశాలు అలర్ట్ !
తొలుత భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ఇప్పటివరకు 132 దేశాలకు పైగా పాకింది. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ సహా థాయ్‌లాండ్, మలేసియాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో నగరంలో శనివారం ఒక్కరోజే 4058 కేసులు, మలేసియాలో 17,786 కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 18,912 కేసులు నమోదవ్వగా.. వాటిలో 60 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌కు చెందినవేనని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు సగటున 80 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్.. అంటువ్యాధి చికెన్‌పాక్స్ లక్షణాలు కలిగిఉన్నట్లు అమెరికా వ్యాధి నిర్మూలన కేంద్రం ప్రకటించింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోనూ డెల్టా వేరియంట్ ఉద్ధృతి పెరిగింది. దీంతో నిత్యం పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.