క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తారక్.. ఏకంగా ఐదు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకంటే ముందే తారక్ ని బుల్లితెరపై చూడబోతున్నాం. తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రామనికి భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేశారు.

వరుసగా ప్రోమోని వదలనున్నారు. ఈ ప్రోమోలకు కల్యాణ దర్శకత్వం వహించారు. మొత్తం ఐదు ప్రోమోలని రెడీ చేశారు. ఆగస్టు 15లోగా ఈ ఐదు ప్రోమోలని విడుదల చేయనున్నారు. అంతేకాదు.. ఈ షోలో మ‌రో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ హ్యాండ్ కూడా ఉంది. కొన్ని ఎపిసోడ్ల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పటికే వదిలిన ప్రోమోని త్రివిక్రమ్ డైరెక్ట్ వహించారు. అందులో మీ ‘రామారావు’ అంటూ తారక్ ని కొత్తగా పరిచయం చేశారు. 

ఇక తారక్ షోలో రామ్ చ‌ర‌ణ్ హాట్ సీటులో కూర్చున్నారు. దానికి సంబంధించిన ఏపీసోడ్ ని ఇప్పటికే షూట్ చేశారు. ఆ ఏపీసోడ్ ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అన్నట్టు.. చరణ్ రూ.25 లక్ష‌లు గెలుచుకున్న‌ట్టు టాక్‌. ఇక తారక్-చరణ్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.