ఇప్పుడు మాస్ బొమ్మపడితే.. !

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకున్నాయి. తొలి వీకెండ్ కూడా గడిచింది. ఈ వీకెండ్ చూస్తే వచ్చిన క్లారిటీ ఏంటంటే ? ప్రేక్షకులు సినిమా చూడడానికి రెడీగా వున్నారు. థియేటర్లలోకి సరైన సినిమాలు రావాల్సి వుంది.
ఈవారం వచ్చిన ఇష్క్, తిమ్మరసు సినిమాలకు మంచి రెస్పాన్స్ నే దక్కుతుంది. ఈ రెండింటిలో ‘ఇష్క్’ డిజాస్టర్ అనిపించుకుంది. ‘తిమ్మరసు’ పర్వాలేదు.

ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ నే వస్తున్నాయి. ఏ, బి సెంటర్స్ లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ.. సి సెంటర్స్ లో ప్రేక్షకులు లేరు. వారికి మాస్ కావాలి. మాస్ సినిమా వస్తే.. గనుక థియేటర్స్ కి పరుగులు పెడతారు.   మాస్ ప్రేక్షకులని మెప్పించేలా ఉన్న.. ‘సీటీమార్’ సినిమా కాపీ రెడీ గానే వుంది. కానీ ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన చేయడం లేదు చిత్రబృందం. లవ్ స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా వచ్చినా.. థియేటర్స్ దగ్గర సందడి చూడొచ్చు. మళ్లీ పాతరోజులు వచ్చినవని సంతోషించ వచ్చు.