తిరుపతిలో జాన్వీకపూర్ పెళ్లి

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ యంగ్ జాన్వీకపూర్ తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని చెప్పింది. తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది.

‘పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్ బోట్‌లో నా గ్యాంగ్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాకా తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక” అని చెప్పింది జాన్వీ. చూస్తుంటే జాన్వీకి పెళ్లిపై తొందర ఎక్కువగానే ఉన్నట్టుంది.


