ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. చరణ్ కి చెప్పేశాడట !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం అనే నినాదాలు చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎక్కడ కనిపిస్తే.. అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తున్నాయి. వారి ముందే జై ఎన్ టీఆర్, వ్యూచర్ సీఎం అంటూ నినదిస్తున్నారు.
ఇక తారక్ ఎక్కడ కనిపించినా.. పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభిమానులు, మీడియా ప్రశ్నిస్తూనే ఉంది. తారక్ మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. తనకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఇప్పట్లో లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ ని పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. ఎవరికి సమాధానం చెప్పని తారక్.. చరణ్ కి మాత్రం ఆన్సర్ చేశారు. పొలిటిల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు.
జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి తారక్ హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకి గెస్ట్’గా చరణ్ హాజరుకానున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏపీసోడ్ ని చిత్రీకరించారు. హాట్ సీటులో కూర్చున్న చరణ్ రూ. 25లక్షలు గెలుచుకున్నాడనే లీకులు కూడా బయటికొచ్చాయి. అంతేకాదు.. ఈ షోలో చరణ్ తారక్ ని కొన్ని ప్రశ్నలు అడిగారట. ఇందులో పొలిటికల్ ఎంట్రీపై కూడా ఓ ప్రశ్న వేశాడని తెలిసింది.
నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నావంటగా..” అంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ను నవ్వుతూ ప్రశ్నించాడు. దీనిపై ఎన్టీఆర్ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన రాజకీయ ఎంట్రీపై చరణ్ కు కొంత స్పష్టత ఇచ్చాడు. కాకపోతే.. దానిని ప్రసారం చేయొద్దని తారక్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇంతకీ పొలిటికల్ ఎంట్రీపై తారక్ ఏమీ చెప్పాడు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.