పుష్ప.. పులి – మేక ఆట‌ !

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ర‌ష్మిక క‌థానాయిక‌. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని తొలి పాటని ఈనెల 13న విడుద‌ల కానుంది. 5 భాష‌ల్లో.. 5గురు సింగర్స్ తో పాడించిన ఈ పాట‌ని ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు. ‘దాక్కో దాక్కో మేక… పులొచ్చి కొరుకుద్ది పీక‌` అంటూ సాగే పాట ఇది. 

ఇందులో పుష్ష‌ క్యారెక్ట‌రైజేష‌న్ ని చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్‌. ఇప్పటికే ‘పుష్ష’ టీజర్ వచ్చింది. యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ద‌క్కించుకుంది. ఇక తొలిపాట అంతకుమించిన స్పందన వచ్చేలా తీసుకొస్తున్నారట. పుష్ప రెండు భాగాలుగా.. పాన్ ఇండియా సినిమా రాబోతుంది. అన్నీ బాషల ప్రేక్షకుల మెప్పించేలా మొదటి నుంచే ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. 

Happy birthday my dear friend @ThisIsDSP. Can’t wait for the world to witness the fantastic album you have composed for #Pushpa, and fall in love with you and your music yet again. Keep entertaining us with your magic. pic.twitter.com/Xnd1aML2QC— Allu Arjun (@alluarjun) August 2, 2021