రాక్షసుడు 2.. పాన్ ఇండియా సినిమా !

‘రాక్షసన్’ తెలుగులో ‘రాక్షసుడు’ వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రిమేక్ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. బెల్లకొండ శ్రీనివాస్ తొలి హిట్ ఇచ్చారు. ఇప్పుడు రాక్షసుడు 2 రాబోతుంది. ఇది మాత్రం రిమేక్ కాదు. రమేష్ వర్మ స్వంత కథను తయారుచేసుకున్నారు. మ్యూజిక్ డైరక్టర్ డిఎస్పీ సోదరుడు సాగర్ ఈ కథకు సహరచయిత.

ఇప్పుడు ఈ కథను పాన్ ఇండియా సినిమాగా చేసే ప్రయత్నం ప్రారంభమైంది. ఇందుకోసం  ఓ బాలీవుడ్ హీరోను సంప్రదించారట. బాలీవుడ్ హీరోతో పాటు తమిళ సంచలన నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారు.తెలుగు హీరో హవీష్ కూడా ఓ పాత్ర పోషించే అవకాశం వుంది. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నారు. అది పూర్తవ్వగానే రాక్షసుడు 2 మొదలవ్వనుంది.