ప్రాజెక్ట్ Kలో సమంత.. ? మరోసారి నెగటివ్ రోల్ ??
‘సాహో’ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టేశాడు బాహుబలి ప్రభాస్. ఇందులో ప్రాజెక్ట్ K ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్లు ఉన్నారు. ఇప్పుడు మరో కథానాయిక కూడా నటించబోతోందని టాక్. ఆమె సమంత అనే ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో కథానాయిక తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న స్త్రీ పాత్ర ఉందని తెలుస్తోంది. కాకపోతే అది నెగటివ్ రోల్. ఆ పాత్ర కోసం సమంతని తీసుకొనే అవకాశాలు ఉన్నాయట. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ లో సమంత నెగటివ్ రోల్ లో నటించింది. ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మరోసారి డీ-గ్లామర్ రోల్ లో కనిపించేందుకు సమంత ఓకే చెప్పవచ్చు.
మహానటిలో సమంత కీలక పాత్రలో నటించింది. నాగ్ అశ్విన్ తో సామ్ కి మంచి స్నేహబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అడిగితే సామ్ నో చెప్పదు. ఇదీగాక.. అమితాబ్, దీపిక లాంటి స్టార్లు ఉన్న పాన్ ఇండియా సినిమాలో ఓ పాత్ర అంటే సామ్ అస్సలు వదులుకోదని చెబుతున్నారు. అయితే సామ్ కు ప్రభాస్ తో సీన్స్ ఉంటాయా ? అన్నది తెలియాల్సి ఉంది.