‘ఆచార్య’కు ఆ ఒక్కటే ఆప్షన్

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. అక్టోబర్ 13న ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ డేటుని ‘ఆర్ఆర్ఆర్’ మిస్ చేసుకోవడం లేదు. ఇక సంక్రాంతి రేసులో చిరుకి చోటు లేదు. ప్రభాస్, మహేష్, పవన్ కల్యాణ్ పోటీలోకి దిగిపోయారు.

పోనీ.. డిసెంబర్ క్రిస్మస్ కు వద్దామనుకుంటే.. ఆ డేటుని అల్లు అర్జున్ బుక్ చేసుకున్నాడు. పుష్ప రిలీజ్ డేటుని ప్రకటించేశారు.ఈ నేపథ్యంలో ఆచార్యకు మిగిలింది.. ఒక్కటే డేటు. అది సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ వచ్చేలోపు సోలోగా దున్నేసుకోవచ్చు. ఈ డేటుని మిస్ చేసుకుంటే ఆచార్యకు వచ్చే యేడాది సమ్మర్ వరకు ఖాళీ లేదు. ఆలస్యం చేస్తే.. ఈ డేటుని మరొకరు కొట్టేసే ఛాన్స్ ఉంది. అందుకే ఒకట్రెండు రోజుల్లోనే ఆచార్య రిలీజ్ డేటుని ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.