అమెజాన్ ప్రైమ్ లో ‘టక్ జగదీష్’

నేచురల్ స్టార్ నాని ఇప్పటికే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఆయన నటించిన 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలైంది. కానీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఓటీటీ రిలీజ్ కి వెళ్లకూడదని నాని గట్టిగానే ప్రయత్నించాడు. తన తాజా చిత్రం టక్ జగదీష్ ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఇన్నాళ్లు ఆపుకుంటూ వచ్చారు. 

రెండు కరోనా సీజన్లకు వడ్డీలు కూడా కట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కానీ రాను రాను వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయి. అందుకే నిర్మాతలు ఆగలేకపోయారు. ఓటీటీకి ఇచ్చేశారు. అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్ విడుదల కానుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారమ్.

శివనిర్వాణ-నాని కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించిన సినిమా ఇది. రీతూ వర్మ హీరోయిన్. నిన్నుకోరి తర్వాత నాని-శివ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరీ.. రెండో ప్రయత్నంలోనైనా నాని ఓటీటీ ప్రేక్షకులని మెప్పిస్తారేమో చూడాలి.