పాగల్.. కడుపుబ్బా నవ్వించే చిత్రం !
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తొలిసారి ప్రేమలో పడ్డాడు. మాస్-యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో మెప్పించిన విశ్వక్ సేన్.. తొలిసారి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించారు. అదే పాగల్. నరేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ బిజీగా గడుపుతున్నారు.
తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అప్పట్లో ‘ఇడియట్’.. ఇప్పుడు ‘పాగల్’ అన్నారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. కుటుంబంతో కలిసి చూసే సినిమా. 2.30గంటలు అప్పుడే అయిపోయిందా అనిపించేలా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్ 10నిమిషాలు ఉంటుంది. అప్పుడు థియేటర్లలో ఏమవుతుందో మీరే చూస్తారని చెప్పుకొచ్చారు.